తారక్‌కు కరెక్ట్ మొగుడు నా బుజ్జి అభయ్ కుట్టి

0

డైలాగ్ డెలివరీలో, నటనలో తాతనే మించిపోయి.. టాలీవుడ్ యంగ్ టైగర్‌గా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌ను బీట్ చేసేందుకు కరెక్ట్ మొగుడు వచ్చాడని మంచు మనోజ్ చెప్పాడు. వివరాల్లోకెళితే..

మనోజ్ ఇటీవల తారక్ ఇంటికి వెళ్లాడట. అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ తనయుడు అభయ్, మనోజ్‌కి అతిథి మర్యాదలు చేశాడట. చల్లటి నీళ్ల గ్లాస్‌తో స్వాగతం పలికాడట.. స్వాగతం పలకడమే కాదు.. స్వయంగా తానే తాగించాడట కూడా. అభయ్ ప్రేమకు ముచ్చటపడిపోయిన మనోజ్.. దాని తాలూకు ఫోటోను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేస్తూ.. ‘తారక్‌కు కరెక్ట్ మొగుడు నా బుజ్జి అభయ్ కుట్టి.. తారక్‌ కంటె వంద రెట్లు ఎనర్జీ ఉంది’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. మనోజ్ సరదాగా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Comments

Share.

Comments are closed.