బిగ్ బాస్ షో కోసం ముంబై వెళ్లనున్న ఎన్టీఆర్

0

తెలుగులో ‘బిగ్ బాస్’ షోను ప్రసారం చేయడానికి స్టార్ మా ఛానెల్ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో హోస్ట్ గా ఎన్టీఆర్ ని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన తొలి పోస్టర్ ని ట్విటర్లో విడుదల చేశారు. అందులో కుర్చీలో కూర్చోన్న ఆయన కొంటెగా ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ షో కోసం ఫ్యాన్స్ ఎదురు చూడడం మొదలెట్టారు. వారిని ఎక్కువగా ఊరించకుండా సాధ్యమైనంతవరకు తొందరగా ప్రసారం చేయడానికి షూటింగ్ పనులు మొదలెట్టారు.

ముంబై లోని ఓ స్టూడియోలో పెద్ద సెట్ ని ప్రిపేర్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ప్రతి శుక్రవారం ఈ సెట్ కి వెళ్లాల్సి ఉంటుంది. అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకునేందుకు ఓ గెస్ట్ హౌస్ ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షో కోసం కొంతమంది యువనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ సెలక్షన్ పూర్తి అయిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది.

Comments

Share.

Comments are closed.