జై లవ కుశ పై క్రేజ్ మామూలుగా లేదుగా …!

0

జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ ని టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోబెట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ 135 కోట్లు వసూలు చేసి లాభాలను పంచి పెట్టింది. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జై లవకుశ థియేటర్ హక్కులను సొంతం చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆఫర్లను నిర్మాత కళ్యాణ్ రామ్ ముందు ఉంచుతున్నారు.

ఇంకా సినిమా షూటింగ్ దశలోనే ఉంది కనుక ఇప్పుడే బిజినెస్ వద్దని తోసి పుచ్చుతున్నా డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి కారణంగా జై లవకుశ థియేటర్ రైట్స్ ని అమ్మడానికి సిద్ధమయినట్లు తెలిసింది. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట. నైజాం 28 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్లు పలికింది.

తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న జై లవకుశ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నివేత థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ  సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది

Comments

Share.

Comments are closed.