ఎన్టీఆర్ షోకి థ‌మ‌న్ మ్యూజిక్

0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు బుల్లి తెరపైన సంద‌డి చేసేందుకు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే.

బిగ్ బాస్ షోని తెలుగులో తాను హోస్ట్ చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మం షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.  క‌ట్ చేస్తే బిగ్ బాస్ షో టైటిల్ ట్రాక్ కి త‌మన్ సంగీతం అందించాడ‌ట‌.

ఈ విష‌యాన్ని త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశాడు క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్. అనేక సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన థ‌మ‌న్ , ఎన్టీఆర్ స్టైల్ కి త‌గ్గ‌ట్టే ట్రాక్ అందించి ఉంటాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో బిగ్ బాస్ షో బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుండ‌గా, అభిమానులు ఈ కార్య‌క్ర‌మం కోసం చాలా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

Comments

Share.

Comments are closed.