అదరగొడుతోన్న ఎన్టీఆర్ !

0

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారి ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెర్ఫార్మ్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉందట. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు బాబీ చిత్రీకరిస్తున్నాడు. ఎన్టీఆర్ తన పాత్రలో ఒదిగిపోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలలో నెగిటివ్ రోల్ కూడా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేద థామస్ లు నటిస్తున్నారు.

Comments

Share.

Comments are closed.