అభయ్‌ రాక నా జీవితాన్నే మార్చేసింది

0

‘‘అభయ్‌ని చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. చిన్న పిల్లల నిష్కల్మషమైన మనసు ఒక అద్దం లాంటిది. వాళ్లలాగే హాయిగా ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అభయ్‌ అంటే రెండు అర్థాలున్నాయి. భయం లేనివాడు, అభయం ఇచ్చేవాడు.. అని. తన రాక నా జీవితాన్నే మార్చేసింది.

తన కోసం, తన భవిష్యత్తు కోసం ఆలోచించడంలో ఎంతో తృప్తి ఉంది. ‘స్టార్‌ కిడ్‌’ అనే భారం తనపై పడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే.. అప్పుడే తను తనలా ఎదగగలుగుతాడు. షూటింగ్‌ అయ్యాక.. ఎప్పుడెప్పుడు వాడి దగ్గర వాలిపోదామా, వాడితో ఆడుకొందామా అని ఉంటుంది. దార్లో కారులో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని చూస్తుంటే నాకు అభయ్‌ గుర్తొస్తుంటాడు. అప్పుడు కారు తిప్పి.. మళ్లీ వాడి దగ్గరకు వెళ్లిపోవాలని అనిపిస్తుంటుంది’’

Comments

Share.

Comments are closed.