‘ఎన్టీఆర్’తో ఢీ అంటోన్న నారావారబ్బాయి…?

0

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఫిలింట్రేడ్ సర్కిల్స్’లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్, కథా కథనాలు సిద్ధం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్’లో వినిపిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రాధకృష్ణ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జై లవ కుశ షూటింగ్ తరువాత బిగ్ బాస్ తెలుగు షో షూటింగ్ కోసం కొంత కాలం ముంబైలోనే ఉండనున్నారు ఎన్టీఆర్.

Comments

Share.

Comments are closed.