ఎన్టీఆర్ వెనుక క్యూ క‌డుతున్న అవార్డులు..!

0
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వెండితెర‌పై తిరుగు లేని స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ కి బుల్లి తెర‌పై సంద‌డి చేసే అవ‌కాశం ఇచ్చారు స్టార్ మా యాజ‌మాన్యం. అయితే టెంప‌ర్ సినిమాకి ముందు ఎన్టీఆర్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. స‌క్సెస్ పర్సంటేజ్ బాగా త‌గ్గ‌డంతో ఫ్యాన్స్ డీలా ప‌డ్డారు. కాని పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన టెంప‌ర్ సినిమా జూనియర్ కి మంచి బూస్ట‌ప్ ని ఇచ్చింది.
ఇక అక్క‌డి నుండి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలు ఎన్టీఆర్ స్టార్ డం నిపెంచాయి. ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ అనే చిత్రాన్ని చేస్తుండ‌గా తొలి సారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఇలా ఎన్టీఆర్ రోజు రోజుకి త‌న సినిమాల‌తో అభిమానుల‌ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు చాలా కృషి చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తి ఫ‌లం కూడా వెంట‌నే ద‌క్కుతుంద‌ని చెప్పాలి. ఆ మ‌ధ్య సినీ మా అవార్డుల్లో టెంపర్ చిత్రానికి చిరంజీవి చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్, ఐఫా.. సైమాల్లో జనతా గ్యారేజ్ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కించుకున్నాడు. ఇక రీసెంట్ గా జ‌రిగిన ఫిలిం ఫేర్ అవార్డుల‌లో నాన్న‌కు ప్రేమ‌తో చిత్రానికి గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్ట‌ర్ మేల్ అవార్డు అందుకున్నాడు. 

Comments

Share.

Comments are closed.