మరో అవార్డును కైవశం చేసుకున్న ఎన్టీఆర్

0

హ్యాట్రిక్ హిట్ తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి అవార్డులు కూడా వరుసగా వస్తున్నాయి. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లో విభిన్నమైన నటనను ప్రదర్శించారు. అందుకు ఇదివరకే చాలా అవార్డులు గెలుచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఆయన కనబరచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ సంతోషంలో ఉండగానే మరో అవార్డు తలుపుతట్టింది. ‘శంకరాభరణం’ అవార్డుకి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఏంటి ఈ అవార్డు పేరు ఇదివరకు వినలేదే… అనే సందేహం రావడంలో తప్పులేదు. ఈ అవార్డును సీనియర్ నటి తులసి కొత్తగా నెలకొల్పారు. 

కళాతపస్వి కె.విశ్వనాధ్ గారి పేరు మీద ఈ అవార్డ్సు నెలకొల్పారు. ఈ అవార్డుల విజేతల ప్రకటనలో ‘ఎన్టీఆర్’తో పాటు హిందీ నుండి ఉత్తమ నటుడిగా అమీర్ ఖాన్ (దంగల్), ఉత్తమ నటిగా ‘అలియా భట్’ (ఉడ్తా పంజాబ్) లు ఎంపికవగా తమిళ పరిశ్రమ నుండి ఉత్తమ దర్శకుడిగా ధనుష్ (పా.పాండి), మలయాళం నుండి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం రేపు (జూన్ 20) హైదరాబాద్’లోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో (శిల్పకళావేదిక) వైభవంగా జరగనుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఎన్టీఆర్ మరియు ధనుష్ ముఖ్య అతిధులు.

Comments

Share.

Comments are closed.