యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోంది ‘జైలవకుశ’ సినిమా యూనిట్… బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ తొలి సారి మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా… ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే మూడు క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ లుక్ మాత్రమే విడుదల చేయగా… జులై ఫస్ట్ వీక్‌లో ‘జైలవకుశ’ టీజర్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది చిత్ర యూనిట్.
నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక జులై ఫస్ట్ వీక్‌కు మరో విశేషం ఉంది… జులై 5వ తేదీన నందమూరి హీరో, జైలవకుశ నిర్మాత కల్యాణ్ రామ్ బర్త్‌డే కూడా ఉంది. దీంతో జులై 5వ తేదీనే జైలవకుశ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ ఫస్ట్ వీక్‌లో మంచి ట్రీట్ అందుకోనున్నారు.