జై లవకుశ టీజర్ రిలీజ్ డేట్

0

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన భారీ సెట్ లో కీలక సీన్లకు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లోగో తో పాటు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. సినిమాపై ఆసక్తిని పెంచాయి. అందుకే టీజర్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్. జులై మొదటి వీక్ లో రిలీజ్ చేయాలనీ బాబీ అనుకుంటున్నారు. డేట్ పై చర్చలు సాగుతున్నాయి. తేదీ ఫిక్స్ కాగానే అధికారికంగా వెల్లడించనున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ కి సూపర్ పాటలను ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ జై లవకుశకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ కి థియేటర్లోకి రానుంది.

Comments

Share.

Comments are closed.