ఎన్టీఆర్ బంగారం… కంటతడి పెట్టిన తులసి

0

వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ఎలాంటి వ్యక్తో అలనాటి హీరోయిన్ తులసి వివరించారు. అందరిమనసుల్లో శంకరాభరణం తులసిగా స్థానాన్ని పదిల పరుచుకున్న ఆమె.. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంట తడి పెట్టారు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌ను నేరుగా నేనింత వరకు చూసింది లేదు. కనీసం ఆయనతో నటించలేదు. కానీ, ఎన్టీఆర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకే కాదు.. నా కొడుకుకు కూడా. ఆయన చుట్టూ ఆయనను అభిమానించే ఓ లేడీస్ సర్కిల్ ఉంది. నాకు కనీసం పరిచయం కూడా లేని ఆయన.. నేను వస్తున్నానని చెబితే ముఖ్యమైన సీన్‌ను వదిలేసి మరీ నా కోసం వచ్చారు. నన్ను ఆయన రిసీవ్ చేసుకున్నారు. ‘అయ్యో అమ్మా.. మీకెందుకు అమ్మా.. నేను వస్తున్నాను’ అంటూ ఆయన నా దగ్గరకు వచ్చారు. అలా అన్నారు చూడండి అది చాలు. ఆ అబ్బాయిని కలిశాక.. ఆయనేంటో ఇంకా అర్థమైంది. నాకు కళ్లలో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయి. నాన్న..బాబు నాకు మీరు తెలియదు.. అయినా నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరిలా వచ్చారు అని అంటే.. మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు.

అదే నన్ను బాగా కదిలించేసింది. ఆయన గురించి నేను చాలా చోట్ల విన్నాను. ఆయన మాటిస్తే మాటే. చాలా పద్ధతి గల మనిషి. చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయి ఇక్కడితో ఆగడు. మహనీయుడు అవుతాడు. నేనింత వరకు చెప్పినవన్నీ జరిగాయి. మనసులో ఏ చెడు లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయి. ఆయన ఒట్టి యాక్టర్‌గానే కాదు.. సమాజానికే ఓ స్ఫూర్తిగా నిలుస్తారు. డార్లింగ్ చేసేటప్పుడు ప్రభాస్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఆయనెక్కడున్నారో తెలుసు. మహేశ్.. ఆయనకు ఎంత ఓపిక. వీళ్లతో కనీసం నేను పనిచేశాను. కానీ, ఎన్టీఆర్‌ను కలవడం అదే ఫస్ట్ టైం. అయినా సరే.. అంత తక్కువ సమయంలో షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి మరీ కలిశారు నన్ను. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే నేను ఆయనకు అమ్మ లాంటిదాన్నే. ఎన్టీఆర్ బంగారం. ఈ అబ్బాయి మీరు చూసే అబ్బాయి కాదు. ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి’’ అని ఎన్టీఆర్ గురించి చెబుతూ తులసి లైవ్‌లోనే కంటతడి పెట్టారు.

Source: AndhraJyothy.com

[embedyt]https://www.youtube.com/watch?v=4MNPydyriwM[/embedyt]

Comments

Share.

Comments are closed.