విలన్‌తో ఎన్టీఆర్‌ ఫైట్‌

0

ఎన్టీఆర్‌ తొలిసారి మూడు పాత్రలు పోషిస్తోన్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ (‘పవర్‌’ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఓ నాయికగా నటిస్తుండగా, ‘జెంటిల్‌మన్‌’ చిత్రంతో అందరి మనసులూ దోచుకున్న నివేదా థామస్‌ మరో నాయికగా చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌ పోషిస్తున్న మూడు పాత్రల్లో ఒక దానికి నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. ఈ పాత్రను తారక్‌ సవాలుగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌..

ఇప్పటికే ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌.. ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా కన్నడ హీరో దునియా విజయ్‌ విలన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మరో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు రోణిత్‌ రాయ్‌ నటిస్తున్నారు. సీనియర్‌ నటుడైన ఆయన ఈ మధ్యే వచ్చిన ‘గుడ్డూ రంగీలా’, ‘కాబిల్‌’ సినిమాల్లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని రాళ్లగనుల్లో ఎన్టీఆర్‌, రోణిత్‌ రాయ్‌, ఫైటర్లపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ జరగనుంది. జూలై తొలి వారంలో ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

Share.

Comments are closed.