ఎన్టీఆర్ సినిమాకు బాలీవుడ్ విల‌న్

0

జ‌న‌తా గ్యారేజ్ విజ‌యం త‌ర్వాత జూ. ఎన్టీఆర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం బాగా జోరుగా సాగుతుంది.

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాను బాబీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా, ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయే చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాడు బాబీ. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్ ను ఫైన‌ల్ చేసింది జై ల‌వ‌కుశ టీమ్. ఉదాన్, అగ్లీ వంటి బాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన రోనిత్ రాయ్ ను విల‌న్ గా తీసుకున్నారు. ఆల్రెడీ రోనిత్ రాయ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడ‌ని, ప్ర‌స్తుతం హైదరాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని ఓ క్వారీలో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను రూపొందిస్తున్నార‌ని స‌మాచారం.

అయితే మొద‌ట్లో ఈ పాత్ర కోసం క‌న్నడ న‌టుడు దునియా విజ‌య్ ను అనుకున్న‌ప్ప‌టకీ, రోనిత్ రాయ్ అయితే ఈ క్యారెక్ట‌ర్ కు పూర్తి శాతం న్యాయం చేయ‌గ‌ల‌డ‌నే ఉద్దేశ్యంతో, రోనిత్ కే ఓటు వేసింది సినిమా టీమ్. ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ తో పాటూ, ఈ విల‌న్ క్యారెక్ట‌ర్ కు కూడా ప్రోస్థ‌టిక్ మేక‌ప్ ఉంటుందని, రోనిత్ రాయ్ కూడా ఈ సినిమాలో డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ లు హీరోయ‌న్లు గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ త‌న సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 1న సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Comments

Share.

Comments are closed.