స్పెషల్ సాంగ్ ఎన్టీఆర్ కోసమే చేశా

0

టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ కోలీవుడ్ ‘క్వీన్’ గా మెప్పించడానికి సిద్ధమవుతోంది.  కథానాయిక పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్ చేయమని ఇటు తెలుగు, అటు తమిళ చిత్రపరిశ్రమ నుంచి కాజల్ ని సంప్రదించేవారి జాబితా ఎక్కువగా ఉంది. అయితే వారందరికీ నో అని సమాధానం చెబుతోంది. 

భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నప్పటికీ సినిమాలో ఆ పాటకు పెద్దగా ప్రాముఖ్యత లేదని అంగీకరించటం లేదంట. మరి ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తే… ఆ పాటకు సినిమాలో ప్రాముఖ్యత ఉండటం వలన మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం వలన ఆ పాట చేశానని చెప్పుకొచ్చింది.

Comments

Share.

Comments are closed.