క్వారీలో ‘లవకుశ’ ఫైటింగ్‌

0

ఎన్టీఆర్‌ సినిమా అంటే… డ్యాన్సులు, డైలాగులే కాదు. రసవత్తరమైన యాక్షన్‌ ఘట్టాలు కూడా! మాస్‌ని తన ఫైట్లతో మురిపిస్తుంటాడు ఎన్టీఆర్‌. అందుకే ‘జై లవకుశ’లోనూ భారీ యాక్షన్‌ దృశ్యాలతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. రాశీ ఖన్నా కథానాయిక. కల్యాణ్‌ రామ్‌ నిర్మాత. బాబి దర్శకుడు.
ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఉన్న ఓ క్వారీలో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘కాబిల్‌’ లాంటి చిత్రాలతో అలరించిన బాలీవుడ్‌ నటుడు రోనిత్‌ రాయ్‌ ‘లవకుశ’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రోనిత్‌కీ తారక్‌కీ మధ్య ఈ ఫైట్‌ సాగుతోంది. ఫైట్‌ మాస్టర్‌ అనిల్‌ అరసు ఈ యాక్షన్‌ ఘట్టాన్ని కంపోజ్‌ చేశారు. నెలాఖరు వరకూ క్వారీలోనే షూటింగ్‌ కొనసాగించబోతున్నారు. రంజాన్‌ సందర్భంగా టీజర్‌ విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. చిత్రబృందం ఆలోచన మారింది. జులై తొలి వారంలో ‘జై లవకుశ’ టీజర్‌ని విడుదల చేస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.