ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, ఆయనకి సాటెవ్వరూ లేరు

0

“ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఒద్దికగా ఉంటారు. అతనికి సాటెవ్వరూ లేరు” అని బాలీవుడ్ నటుడు రోనిత్‌ రాయ్‌ చెప్పారు. “ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండడం నాకు ఆనందంగా ఉంది. విద్యార్థిగా ఇక్కడ షూటింగ్ లో పాల్గొన్నాను. ఎంతో నేర్చుకోవాలి” అని ట్వీట్ చేశారు.

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రంలో విలన్ గా రోనిత్‌ రాయ్‌ ఖరారు కాగానే తారక్ ఫ్యాన్స్ ఆయనకీ ఘనస్వాగతం పలికారు. దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. గురువారం రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన ‘జై లవకుశ’ భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో థియేటర్లోకి రానుండగా.. జులై మొదటి వారంలో టీజర్ విడుదల కానుంది.

Comments

Share.

Comments are closed.