త్వరలోనే టీజర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలవకుశ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది.

ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో టీమ్ ఇంకా కేర్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌ను జూలై మొదటివారంలో విడుదల చేస్తారట. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Source: Andhrabhoomi

Comments

Share.

Comments are closed.