మలయాళం నుంచి జైలవకుశకు భారీ ఆఫర్

0

జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 135 కోట్లు వసూలు చేసి తారక్ సత్తాని చాటింది. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జై లవకుశ దేశవ్యాప్తంగా థియేటర్ హక్కులను సొంతం చేసుకోవాలని డిస్టిబ్యూటర్లు 85 కోట్లు ఆఫర్ చేశారు. అయినా నిర్మాత కళ్యాణ్ రామ్ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు మరో ఆఫర్ నిర్మాత తలుపుతట్టింది. మలయాళం థియేటర్స్ రైట్స్ కావాలని అక్కడి డిస్టిబ్యూటర్లు అడుగుతున్నారు. మల్లూవుడ్ లో సినిమా నిర్మితమయ్యే బడ్జెట్ తో కోట్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జనతా గ్యారేజ్ తో కేరళ ప్రజలకు ఎన్టీఆర్ దగ్గరయ్యారు.

దీంతో తారక్ సినిమా అనగానే ఓపెనింగ్స్ బాగుంటుందని కేరళ ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారు. అందుకే రైట్స్ సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే సినిమా మొదటి కాపీ వచ్చేవరకు బిజినెస్ గురించి ఫైనల్ చేయనంటూ కళ్యాణ్ రామ్ డిస్ట్రిబ్యూటర్స్ కి చెబుతున్నట్లు తెలిసింది. తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న  జై లవకుశ సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది.

Comments

Share.

Comments are closed.