ముందుగానే జైలవకుశ సందడి

0
UPDATE: జైలవకుశ సినిమాని సెప్టెంబర్ 21న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

ఎన్టీఆర్ “జైలవకుశ” సినిమాని కాస్త లేటుగా ప్రారంభించినప్పటికీ ముంగింపు మాత్రం తొందరగానే ఇస్తున్నట్లు తెలిసింది. బాబీ పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేయడంతో పాటు, తారక్ ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటుండడంతో అనుకున్న తేదీ కంటే కాస్త ముందే రెడీ అయిపోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మూడో షెడ్యూల్ సైలెంట్ గా సాగుతోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగుతుంది. వచ్చే నెల ఆఖరి షెడ్యూల్ మొదలవుతుంది. జులై చివరినాటికి ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుంది. దీంతో సెప్టెంబర్ కంటే ముందుగానే తొలి కాపీ చేతికి వస్తుంది. సో జై లవకుశ సెప్టెంబర్ 1 కంటే ముందే థియేటర్లోకి రావచ్చని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సినిమాలో నివేత థామస్, రాశీ ఖన్నా, నందితా రాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హ్యాట్రిక్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Comments

Share.

Comments are closed.