జైలవకుశ విడుదల తేదీ ఖరారు

0

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’.బాబీ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రంజాన్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ‘జై లవకుశ’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. 

ఎన్టీఆర్‌ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ‘జై’, ‘లవ కుమార్‌’, ‘కుశల్‌ కుమార్‌’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. జులై తొలివారంలో టీజర్‌ను విడుదల చేయనున్నారు.

హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్టు వాన్స్‌ హార్ట్వెల్‌ ‘జై లవకుశ’ కోసం పనిచేస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. బుల్లితెర హిందీ నటుడు రోనిత్‌ రాయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నందిత కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీఫిల్మ్‌ సిటీలో రూ. 2 కోట్లతో భారీ సెట్‌ వేశారు.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.