జై కొడతారు

0

దసరాకి వారం రోజులు ముందుగానే సందడి చేయబోతున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘జై లవకుశ’ సెప్టెంబరు 21న విడుదల కానుంది. రంజాన్‌ పండగని పురస్కరించుకొని చిత్రబృందం ఆదివారం ఆ విషయాన్ని ప్రకటించింది.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరకెక్కుతున్న చిత్రమిది. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. బాబీ దర్శకుడు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోందీ చిత్రం. ఇటీవల హైదరాబాద్‌ పరిసరాల్లో కొన్ని కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు.

ఎన్టీఆర్‌ ఇందులో రావణుడిలా ప్రతినాయక ఛాయలున్న పాత్రలోనూ కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర కోసం విదేశీ మేకప్‌ నిపుణులు పనిచేస్తున్నారు. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.