‘టెంపర్’ నుంచి వరుస విజయాలు అందుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను కూడా పెంచుకుంటున్నారు. త్వరలో బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ షో ద్వారా సందడి కూడా చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేడనే విషయం అందరికి తెలిసిందే.
2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన ఎన్టీఆర్ ఈ మధ్యే రెగ్యులర్ ట్వీట్స్ చేస్తూ అభిమానులతోనూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. తన సినిమాలకి సంబంధించిన విషయాలనే కాక ఇతర విషయాలు కూడా షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కి ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా ట్విటర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్కును దాటింది. ప్రస్తుతం తారక్‌ను 10,00,647 మంది అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జైలవకుశ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. జులై తొలివారంలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.