ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జక్కన్న

0

టాలీవుడ్ నుంచి పొలిటికల్ ప్రచారం వరకూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పిన జోస్యం అందరినీ ఆశ్చర్య పరచింది.

అయితే సరదాగా అనుకున్న సంధర్భమే అయినా ఆ స్టేట్మెంట్ నిజమే అన్నంత బలాన్ని చేకూర్చింది. విషయంలోకి వెళితే, రానా ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోకు రాజమౌళి అతిధిగా వచ్చారు. ఇక రానా అడిగిన ఒక ర్యాపిడ్ ప్రశ్నా కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు మన జక్కన్న. అదేంటి అంటే….

ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కొంతమంది టాప్ హీరోలు సినిమాలలోకి రాకుండా వేరే వృత్తులలో నిలదొక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే వారు ఏ రంగాలకు బాగా సూట్ అవుతారు అని రానా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు జక్కన్న. అందులో మిగిలిన హీరోల మాట ఎలా ఉన్నా… ఎన్టీఆర్ సినిమాలలోకి రాకుండా ఉండి ఉంటే ఈ సమయానికే రాజకీయాలలోకి వెళ్ళి ఒక చక్రం తిప్పి ఉండేవాడని ఎన్టీఆర్ టాలెంట్, ఎన్టీఆర్ స్టామినాని మరోసారి బయటపెట్టాడు జక్కన్న…ఇక ఈ స్టేట్మెంట్ వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు అని చెప్పాలి.

[embedyt]https://www.youtube.com/watch?v=IULWdfe57Cw[/embedyt]

Comments

Share.

Comments are closed.