‘జైలవకుశ’ సన్నివేశాలు లీక్‌ చేసిన నిందితుడు అరెస్టు

0

ఎన్టీఆర్‌ కథానాయకుడుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవకుశ’, బాబీ దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా ‘జై లవకుశ’లోని సన్నివేశాలను లీక్‌ చేసిన కొంతమంది నిందితులను గుర్తించి, అరెస్టు చేయించాం’ అని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. 

‘జై లవకుశ’లోని సన్నివేశాలు లీక్‌ చేసిన ప్రధాన నిందితుడు ఆన్’లైన్  ఎడిటర్  గణేశ్‌ అని, అతడ్ని అరెస్టు చేయించామని చిత్ర బృందం తాజాగా తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. లీకైన సన్నివేశాలు అధికారిక టీజర్‌లోనివి కాదని, కేవలం రఫ్‌ కట్‌ మాత్రమే అని చెప్పింది. దయచేసి లీకైన ఫొటోలను షేర్‌ చేయొద్దని సినీ అభిమానులను చిత్ర బృందం కోరింది.

[embedyt]https://www.youtube.com/watch?v=gYtFH6iw3Oo[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=WFOtpWOed2Q[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=9YL6UlEHrr8[/embedyt]

Comments

Share.

Comments are closed.