‘టాక్ ఆఫ్ ది టౌన్’ ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ పేరు వింటేనే చాలు మాస్ ఫ్యాన్స్ అంతా అభిమానంతో ఊగిపోతారు. అలాంటి ఎన్టీఆర్ ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డాడు. అయితే కంటెంట్ ఉన్నోడికి కాలమే తోడుగా నిలుస్తుంది అన్న మాటే సాక్ష్యంగా అనేక ఒడిదుడుకుల తరువాత మళ్ళీ హిట్స్ రేస్ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హాట్స్ తో, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ప్రస్తుతం ‘జై లవ కుశ’ సినిమాతో సొంత బ్యానర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత సైతం ఎన్టీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు సాగనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం…అసలు మ్యాటర్ ఏంటి అంటే సినిమా సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను చేయబోతున్నాడని అని ఇప్పటికే మనకు తెలిసిన విషయమే అయితే మరో పక్క ఇప్పటికే జూనియర్ కొరటాల శివ చెప్పిన ఒక కథకు ఒకే చెప్పి ఆ కథకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడ వేగంగా జరుగుతున్నాయి అన్న తెలుస్తోంది.

ఇంతేనా అనుకుంటే ఇంకా చాలా ఉంది అన్నట్లుగా ‘బాహుబలి 2’ తరువాత రాజమౌళి ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ చేత తయారు చేయిస్తున్న కథ విషయంలో కూడ రాజమౌళి మనసులో ఎన్టీఆర్ హీరోగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే వరుస ఫ్లాప్స్ చూసిన ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడు అని అంటూనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా పేరుగాంచిన ఈ ముగ్గురుతో ఎన్టీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు టాలీవుడ్ టాప్ హీరోలకు మైండ్ బ్లాంక్ చేసే విషయంగా మారాయి అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేసుకుని దూసుకెళ్తున్నాడు అని ఒప్పుకోక తప్పదు.

Comments

Share.

Comments are closed.