అవార్డులన్నీ క్లీన్ స్వీప్ చేసిన ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఇప్పటికే ఐఫా, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో నటనకు గాను ఈ అవార్డ్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు సైమా 2017 అవార్డుల్లో కూటా టాప్ ప్లేస్ లో నిలిచారు తారక్.

సైమా 2017లో బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ నిలిచారు. అబుదాబిలో జరుగుతున్న ఈ వేడుకల్లో సౌత్ సినిమా పరిశ్రమకు సంబందించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబందించి అవార్డులు అందచేస్తున్నారు. ఈ సీమా అవార్డుల్లో ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ 8 అవార్డులకు నామినేట్ అవడం విశేషం. జైలవకుశ షూటింగ్ షెడ్యూల్ బిజీలో ఉండి అవార్డుల ఫంక్షన్ కి హాజరు కాలేకపోవడం వల్లనా తారక్ తరపున మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. 

నటి తులసి కె.విశ్వనాధ్ గారి మీద అభిమానంతో ప్రకటించిన శంకరాభరణం అవార్డుల్లో కూడా ఈ సంవత్సరం ఉత్తమ నటుడిగా ఎన్.టి.ఆర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఒకే సంవత్సరం ఫిల్మ్ ఫేర్ నుండి సైమా, ఐఫా లాంటి ప్రెస్టిజియస్ అవార్డులను అందుకుని ఎన్టీఆర్ మరోసారి తిరుగులేని రికార్డ్ సృష్టించాడు.

Comments

Share.

Comments are closed.