‘జై లవ కుశ’ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ‘జై లవ కుశ’ టీజర్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ను ఇతర చిత్రాల టీజర్ల కంటే కొంచెం భిన్నంగా ప్రేక్షకులకు చూపించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 

ఈ సినిమాలో జై, లవ, కుశ అనే మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అందుకే మూడు పాత్రలను ఒకే టీజర్‌లో చూపించడం కష్టమని… మూడు పాత్రలకు మూడు ప్రత్యేకమైన టీజర్లను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొదటి పాత్ర ‘జై’కు సంబంధించిన టీజర్‌ను జూలై 6న సాయంత్రం 5.22 గంటలకు విడుదల చేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ చిత్ర యూనిట్ పేర్కొంది.

Comments

Share.

Comments are closed.