నవంబర్ నుంచి… ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా

0

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జై లవకుశ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అయిపోగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి (నవంబర్ నుంచి) వస్తుందట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని టాక్. అంతేకాదు హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను ఏప్రిల్ ల్లో థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అమితమైన ఆసక్తి నెలకొంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Comments

Share.

Comments are closed.