రాజమౌళి తరువాతి సినిమా ‘ఎన్టీఆర్’తోనే

0

ఒకరు తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయేలా చేసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి. మరొకరు వరుస పెట్టి హిట్స్ కొడుతూ వరుసగా ఆరు అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న హీరో. ఈ ఇద్దరూ కలసి ఇప్పుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది? రికార్డులు అన్న పదానికి కూడా చలి జ్వరం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అదే జరగబోతుంది… బాహుబలితో ఐదేళ్లు పడిన కష్టానికి జాలీగా ఎంజాయ్ చేస్తున్న జక్కన్న త్వరలో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేస్తాడని అంటున్నారు. అయితే సహజంగా రాజమౌళి ఓ పెద్ద సినిమా తీశాక వెంటనే ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా తీయడం అలవాటు. కానీ ఇప్పుడు రూట్ మార్చాడట, ఈ సారి అంచనాలను మరింత పెంచుతూ ఏకంగా యంగ్ టైగర్ తోనే సినిమా చేస్తున్నాడట.

టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం తారక్ చేస్తున్న జై లవకుశ ముగింపు దశకు చేరుకుంది. అది పూర్తయ్యోలోపు కథ సిద్ధం చేసి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఎన్టీఆర్, రాజమౌళి ఈ కాంబినేషన్ అంటే ఇక ఫ్యాన్స్ కు పండుగే. ఎన్టీఆర్ టాలెంట్ ఏంటో బాగా తెలిసిన రాజమౌళి చేయబోయే సినిమాతో మరో కొత్త యాంగిల్ ప్రెజెంట్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Comments

Share.

Comments are closed.