ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

0

హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చేస్తున్నారు. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. జై లవకుశ రిలీజ్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా తన తరువాతి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా గురించి మరొక్క అప్డేట్, ఇందులో హీరోయిన్ కూడా ఫిక్స్ అయింది.

‘మజ్ను’తో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ ని ఎన్టీఆర్ కి జోడీగా తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల వారు తెలిపాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ పక్కన నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నటనకి ఫిదా అయిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాలోనూ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఎన్టీఆర్ 28వ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Comments

Share.

Comments are closed.