‘జై లవకుశ’ టీజర్‌పై జక్కన్న స్పందన…

0

తన తాజా చిత్రం ‘జై ల‌వ‌ కుశ’ టీజర్‌ రిలీజ్ చేసి… ఆ మూవీపై అంచనాలు పెంచేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్… ” ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాల… ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ద.. ద.. ధైర్యం కావాల… ఉందా?” అంటూ చివర్లో కొంత నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాస్‌ను ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈ మూవీపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘టీజర్ టూ గుడ్’ అంటూ ట్వీట్ చేశారు.

‘జై లవకుశ’ సినిమా టీజ‌ర్‌పై స్పందించిన రాజమౌళి… అంద‌రితో వావ్ అనేలా చేస్తూ… తారక్ ఎంతో అద్భుతంగా ప‌బ్లిసిటీ ప్రారంభించాడని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన రాశి ఖన్నా, నివేథా థామస్‌, నందిత నటిస్తుండగా, ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 21న థియేటర్లలో రానుంది.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Comments

Share.

Comments are closed.