జై వచ్చేశాడు!

0

‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా… ఈ రావణుణ్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా…! ఉందా?’ అంటున్నాడు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘జై లవ కుశ’. ఇందులో ఆయన ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో జై పాత్రకు సంబంధించిన టీజర్‌ గురువారం విడుదలైంది. జై పాత్రలో ఎన్టీఆర్‌ వ్యతిరేక ఛాయలతో కనిపిస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే టీజర్‌ ఉంది.

రాశీ ఖన్నా, నివేతా థామస్‌ కథానాయికలు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. దసరా పండుగని పురస్కరించుకొని చిత్రాన్ని సెప్టెంబరు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.


Comments

Share.

Comments are closed.