రాముడు రావణుడైతే ఇలా ఉంటుంది : కొరటాల శివ

0

ఎన్టీఆర్ జైలవకుశ టీజర్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ల మందికి పైగా ఈ టీజర్‌ను చూశారంటే.. అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైలవకుశలోని జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవీశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రావణుడి క్యారెక్టర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ టీజర్‌పై కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ టీజర్ చాలా బాగుందని కితాబిచ్చాడు. టీజర్ ద్వారా సినిమాను జనంలోకి తీసుకెళ్లిన తీరు నిజంగా అద్భుతమని రాజమౌళి కొనియాడాడు. దర్శకుడు కొరటాల శివ తారక్ జైలవకుశ టీజర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. రాముడు రావణుడైతే ఇలా ఉంటుంది అని తన స్పందన ఏంటో చెప్పకనే చెప్పేశాడు. దర్శకుడు బాబీ ఎన్టీఆర్‌ను వైవిధ్యంగా చూపించాడని అభినందించాడు.


Comments

Share.

Comments are closed.