ఆ ధైర్యం మా తారక్‌కి ఉంది: రాఘవేంద్రరావు

0

తాజాగా విడుదలైన ఎన్టీయార్‌ ‘జైలవకుశ’ టీజర్‌కు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమౌళి, హరీష్‌శంకర్‌, కొరటాల శివ వంటి దర్శకులు ఇప్పటికే ‘జైలవకుశ’ టీజర్‌ను అభినందించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఆ సినిమా టీజర్‌లో ఎన్టీయార్‌ చెప్పిన ‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దదద.. ధైర్యం ఉండాల’ అనే డైలాగ్‌ అదిరిపోయింది. ఈ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్‌ ద్వారా ఎన్టీయార్‌ను అభినందించారు. టీజర్‌లోని ఎన్టీయార్‌ చెప్పిన డైలాగ్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలంటే దదద.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం మా తారక్‌కి ఉంది. ఆ ధైర్యాన్ని తెరమీద చూడడానికి నేనూ ఎదరుచూస్తున్నాన’ని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు.


Comments

Share.

Comments are closed.