ఇంకా…ఇంకా మెరుగయ్యేలా కృషి చేస్తా: తారక్

0

జైలవకుశ టీజర్ విడుదలైన కొద్దిసేపటి నుంచే ట్రెండింగ్‌లో ఉంది. సినీ సెలెబ్రిటీలు, అభిమానులే కాదు.. ఇతర హీరోల అభిమానులు సైతం టీజర్ చాలా చాలా బాగుందని వేనోళ్ల పొగుడుతున్నారు.

అభినవ రావణుడిగా జై పాత్రలో తారక్ ఒదిగిపోయిన తీరు, డైలాగ్ చెప్పే విధానం, ఆహార్యంపై నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి, టీజర్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసల నేపథ్యంలో తారక్ స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమ, వారి అభినందనలు, ఫీడ్‌బ్యాక్‌తో చాలా ఆనందమేస్తోంది. ఇంకా..ఇంకా మెరుగయ్యేందుకు కృషి చేస్తాను. లవ్ యూ ఆల్’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


Comments

Share.

Comments are closed.