ఎన్టీఆర్ సునామీ

0

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమా టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే సంచలనం సృష్టించింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పటిదాకా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. పరిశ్రమలో టీజర్ వ్యూస్ పరంగా ఇదొక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు.

టీజర్ చూసిన అభిమానులంతా తారక్ నటనకు, చెప్పిన డైలాగులకు ఫిదా అయిపోగా, సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ముఖ్యమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న ‘జై’ పాత్ర ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. జై పాత్రకు సంబంధించిన టీజర్‌లో ఎన్టీఆర్ నెగెటివ్ పాత్రలో అదరగొట్టాడు. ‘ఆ రావణునిడిని ఎదిరించాలంటే సముద్రం దాటిరావాలి.. కాని ఈ రావణుడిని ఎదిరించాలంటే సంద్రమంత ధైర్యం కావాలి’ అనే డైలాగ్ అదిరింది. ఎన్టీఆర్ పాత్ర చూస్తుంటే సినిమాలో ఏ రేంజ్‌లో రెచ్చిపోయాడో తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాసిఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది.


Comments

Share.

Comments are closed.