ఆల్ టైమ్ రికార్డ్: ‘జై టీజర్’కి కోటి వ్యూస్

0

జై లవకుశ అరుదైన ఘనత సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా.. టీజర్ కోటి వ్యూస్ సాధించింది. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌ 48 గంటల్లోపే కోటి మార్కును చేరింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ వెల్లడించింది.

ఇంతటి సంచలన స్పందన అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న విడుదల కాబోతోంది.

Source: V6News


[embedyt]https://www.youtube.com/watch?v=_wcs7ixyDbY[/embedyt]

Comments

Share.

Comments are closed.