జక్కన్నతో నాలుగోసారి?

0

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం ఏమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రాజమౌళి బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని గత కొతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ-2 తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారని కూడా ఊహాగానాలు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో రూపొందించడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారని తెలిసింది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో స్టూడెంట్ నంబర్1, సింహాద్రి, యమదొంగ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యం వుంది. రాజమౌళిని జక్కన్న అంటూ ఆత్మీయంగా సంబోధిస్తారు ఎన్టీఆర్. దాంతో వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారని అంటున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో పాటు బిగ్‌బాస్‌షోతో బిజీగా వున్నారు. తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే రాజమౌళి చిత్రం మొదలవుతుందని సమాచారం.

Source:NTNews

 

Comments

Share.

Comments are closed.