ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట!

0

నివేదా థామస్… ఇప్పుడ ఆమె ఆరాధ్య నటులలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. నిన్నుకోరి సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్కుతో ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసారు. అభిమానుల ప్రశ్నలకు ఉత్సాహంగా జవాబులు ఇచ్చారు.

అందులో భాగంగానే అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ తనకు అభిమాన హీరో అని చెప్పుకొచ్చారు. సినిమాలో ఎన్టీఆర్ నటనను చూసిన ఆమె ఫిదా అయిపోయారట. అందుకే ఎన్టీఆర్ అంటే ఆమెకు ఇష్టమని చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… జైలవకుశ సినిమా గురించి వివరాలు అడిగినా వాటి గురించి మాత్రం బయటకు చెప్పట్లేదు. ఆ సినిమా కబుర్లు చెప్పుకోవడానికి ఇంకా చాలా చాలా సమయం ఉందంటూ ఆయా ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు.
Source : ఆంధ్రజ్యోతి 

Comments

Share.

Comments are closed.