టీజర్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్ !

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అమితాసక్తి నెలకొన్న సంగతి విధితమే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కూడా ఆ అంచనాల్ని మించేలా ఉండటంతో చిత్రం క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు అంశాల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఈ టీజర్ తాజాగా కేవలం అఫీషియల్ యూట్యూబ్ చానెల్లోనే 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

యూ ట్యూబ్ చానెల్లో ఆరు రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకొని ఔరా అనిపించుకుంది. 2,35,000 పైగా లైక్స్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇంత తక్కువ కాలంలో ఇంతలా ఆదరణ పొందిన టీజర్ ఇదేనని చెప్పొచ్చు. ఈ దూకుడు చూస్తుంటే.. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ సృష్టించడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్ .. టీజర్ దశలోనే రికార్డ్ సృష్టించడం ఎన్టీఆర్ స్పెషల్ అనాల్సి వస్తోంది. మూడు పాత్రల్లో ఒకటైన నెగెటివ్ షేడ్స్ కలిగిన జై పాత్రపై రూపొందించిన ఈ టీజర్లో ఎన్టీఆర్ విలన్ గా సరికొత్త లుక్ లో కనిపించడమే గాక తన నటనతో అబ్బురపరిచేలా చేశాడు. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉండటంతో టీజర్ బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Comments

Share.

Comments are closed.