జైలవకుశ క్లైమాక్స్ కి పూనకాలే

0

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్రనైనా అవలీలగా నటించగలిగే అతి కొద్ది మంది యాక్టర్స్ లో ఎన్టీఆర్ ప్రధమ స్థానంలో ఉంటాడు అంటే ఒప్పుకుని తీరాల్సిందే. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో దూసుకొస్తున్న ఎన్టీఆర్ కి మరో చ్యాలెంజింగ్ రోల్ “జై లవకుశ” రూపంలో దొరకడంతో ఇక ఆ సినిమాలో తన పదునైన నటనను చూపించేందుకు సిద్దం అవుతూ ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికీ ఈ సినిమా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే సినిమా ఎలా ఉంటుందో అన్న అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉన్న క్రమంలో సినిమా క్లైమ్యాక్స్ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది.

 

అసలు విషయంలోకి వెళితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫ్యాన్స్ ను సీట్లలో అసలు కూర్చోనివ్వదని అంటున్నారు. మూడు పాత్రలు ఒకే చోట చేసే హంగామాతో కూడిన క్లైమాక్స్ ఆడియెన్స్ ఊహలకు మించి అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. క్లైమాక్స్ కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూసేలా ఉంటుందట.

 

అందుకే క్లైమాక్స్ సీన్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారట. ఒక్క ఎన్టీఆర్ పాత్రను చూడాలంటేనే రెండు కళ్ళు సరిపోవు అనే రేంజ్ ఉన్న నటనకు ఒకేసారి ముగ్గురు ఎన్టీఆర్ లను చూడడం అంటే నిజంగా అభిమానులకు కనుల విందే అని చెప్పక తప్పదు. ఇక ఇప్పటికే టీజర్ తో జై పాత్రను పరిచయం చేయగా ఇక మిగతా పాత్రలని త్వరలో పరిచయం చేయబోతున్నారు మేకర్స్. లవకుశ పాత్రల కన్నా జై పాత్రకు రీచబులిటీ ఎక్కువగా ఉంటుందని ఆ పాత్ర కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారట దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 21 దసరా కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూద్దాం.

Source: FilmyFocus

Comments

Share.

Comments are closed.