సీనియర్ ఎన్టీఆర్ తన చిత్రాలలో విలన్ చాయలుండే పౌరాణిక పాత్రలను హీరోలుగా మలిచి, వారి యాంగిల్లో కథను నడిపిస్తూ అదరగొట్టారు. ‘భూకైలాస్’లో రావణబ్రహ్మగా, ‘దాన వీర శూర కర్ణ’లో ధుర్యోధనునిగా, కర్ణుడుగా ప్రతి చాయలున్న పాత్రలను పోషించి మెప్పించారు.
ఇక ధుర్యోదనునిలోని నెగటివ్ కోణాన్ని పాజిటివ్’గా చూపిస్తూ తనతో డ్యూయెట్ పాడించి, నృత్యం చేయించి ఆయనలోని శృంగార పురుషుడిని ఆవిష్కరించాడు. కాగా ప్రస్తుతం ఆయన మనవడైన ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో నెగటివ్ చాయలుండే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘జై’ పాత్ర నెగటివ్ షేడ్స్’లో సాగుతూ, రావణాసురుని భక్తునిగా కనిపిస్తుంది. కాగా ఎన్టీఆర్ ‘టెంపర్’లో కూడా దాదాపు సగం చిత్రం వరకు ఆయన నెగటివ్ చాయలుండే పాత్రనే చేసి మెప్పించారు.
అందులో తాను పోషించిన నెగటివ్ పాత్ర ఉన్నంత సేపు ఆయన నటనలో అదరగొట్టడం, ఆ దయా పాత్రకు మంచి స్పందన రావడమే ‘జై లవ కుశ’లో నెగటివ్ పాత్రను చేయడానికి స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ‘జై’ పాత్ర టీజర్ విడుదలై కాస్త నత్తిగా ద… ద… ధైర్యంగా అందరినీ మెప్పించడంతో ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి.