ఎన్టీఆర్ డ్యాన్స్ తో మొదలుకానున్న బిగ్ బాస్ షో !

0

బుల్లితెరపైన రచ్చ చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్ధమైపోయాడు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం ఈ నెల 16నుండి బుల్లితెరపైన ప్రసారం కానుంది. తమ అభిమాన హీరో ఇకపై బుల్లి తెర మీద సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ అంతా షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షోతో పాటే స్పెషల్ ట్రీట్ అన్నట్టు… ఈ షో ఫస్ట్‌ ఎఫిసోడ్‌లోనే ఎన్టీఆర్‌ డ్యాన్స్‌తో అలరించనున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా పుణెలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. 

 

దీని కోసం షో టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారం మొత్తం సాగనున్న ఈ షోలో 5 రోజులు కేవలం సెలబ్రిటీలు మాత్రమే కనిపించగా, చివరి రెండు రోజులు వారితో కలిపి ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. మరి ఎన్టీఆర్‌ చేసే ఆ రచ్చను చూడాలంటే మాత్రం ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు.

 

Comments

Share.

Comments are closed.