లవకుమార్‌ని ఎప్పుడు చూపిస్తారు?

0

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. రాశీ ఖన్నా కథానాయిక. కల్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇటీవల ‘జై’ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్‌ని విడుదల చేశారు.

 

‘ఆ రావణుణ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుణ్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా..’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ అభిమానుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు మిగిలిన రెండు పాత్రలకు సంబంధించి రెండు టీజర్లు విడుదల చేసే పనిలో ఉంది చిత్రబృందం. లవకుమార్‌ని పరిచయం చేస్తూ కట్‌ చేసిన టీజర్‌ని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తారట. ప్రస్తుతం పుణెకి దగ్గర్లోని లోనావాలాలో షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ ఓ ప్యాలెస్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

 

Comments

Share.

Comments are closed.