‘జైలవకుశ’పై క్రేజ్ మామూలుగా లేదుగా…!

0

మూడు వరుస విజయాల తర్వాత టాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే…సరికొత్తగా మూడు పాత్రల్లో వస్తున్న ఎన్టీఆర్ పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

కాగా ఈ అంచనాలను రీసెంట్ గా రిలీజ్ చేసిన టీసర్ మరింతగా పెంచేయగా ఇప్పుడు సినిమాపై బిజినెస్ కూడా మరింతగా పెరిగే చాన్స్ ఉందట. ఇక సినిమా రిలీజ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ లో దుమ్ములేపడం ఖాయం అంటున్నారు. ట్రేడ్ లెక్కల ప్రకారం తొలిరోజు అవలీలగా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 30-35 కోట్లకంటే ఎక్కువ మొత్తమే సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే నాన్ బాహుబలి రికార్డులతో జైలవకుశ భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

 

తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న జై లవకుశలో నివేత థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఈ మూవీ  సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది

Comments

Share.

Comments are closed.