న..న..న.. నాలుగోసారి

0

టాలీవుడ్‌లోని సూపర్‌ డూపర్‌ కాంబినేషన్లలో ఎన్టీఆర్‌ – రాజమౌళిలది ఒకటి. రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్‌ సినిమాతోనే మొదలైంది. ‘స్డూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’లతో హ్యాట్రిక్‌ కొట్టేశారు వీరిద్దరూ. అప్పటి నుంచీ… ఎన్టీఆర్‌ – రాజమౌళి జట్టు కట్టలేదు.

 

ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరిందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి సినిమా ఎన్టీఆర్‌తోనే అన్నది టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’తో బిజీగా ఉన్నారు. ఆ తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కాల్సి వుంది. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తయ్యాకే రాజమౌళి – ఎన్టీఆర్‌ల కాంబో ఉంటుందా? లేదంటే ‘లవకుశ’ అవ్వగానే మొదలెట్టేస్తారా? అనే విషయాలు తెలియాల్సివుంది.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.