బిగ్ బాస్ ఎంట్రీ అదిరింది… ఎన్టీఆర్ డ్యాన్స్ సూపర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొత్తానికి బుల్లితెర మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు బుల్లితెర మీద తన మార్క్ వేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బిగ్ బాస్ షోతో ముందుకు వచ్చేశారు. చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఎన్టీఆర్ బిగ్ బాస్ షో మొత్తానికి ప్రారంభమైంది. స్టార్ మా టీవీలో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ షో మీద ఎన్టీఆర్ కారణంగా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఓ పక్క తెలుగు సినిమా తెర మీద వీరవిహారం చేస్తున్న ఎన్టీఆర్.. బుల్లితెర మీద కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. అయితే అందరూ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం బిగ్ బాస్ షోలో దొరికింది. ఎన్టీఆర్ అభిమానులకు, చాలా మంది తెలుగు అభిమానులకు కనుల విందు చేస్తూ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

 

కోట్ల మంది తెలుగు వారు, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుండగా.. రిచ్ లుక్ తో అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను ప్రారంభించాడు. ఎన్టీఆర్ ఉంటే ఇలా ఉంటుంది అనేలా ఆయన షోకు తగ్గట్టుగా నాన్నకు ప్రేమతో సినిమాలోని ‘ఖేలో ఖేలో ఖేలోరే’ అనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు. క్లాస్ లుక్ తో మాస్ ఎంట్రీ ఇచ్చి.. అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపాడు యంగ్ టైగర్. మరి ఆయన డ్యాన్స్ పర్ఫామెన్స్ ను మీరు కూడా చూడాలని ఉందా… అయితే చూడండి.

 

Comments

Share.

Comments are closed.