ఎన్టీఆర్‌కు వెల్‌కమ్‌ చెప్పిన రానా

0

బుల్లితెరపైన ఎన్టీఆర్‌ ప్రభంజనం మొదలైంది. ‘బిగ్‌బాస్‌’ అంటూ మొదటి ఎపిసోడ్‌తోనే రచ్చ చేశాడు ఎన్టీఆర్‌. యాంకర్‌గా ఏ మాత్రం అనుభవం లేకపోయినప్పటికీ, ‘బిగ్‌బాస్‌’లో వ్యాఖ్యతగా అందరి చేత మంచి మార్కులు వేయించుకున్నాడు యంగ్‌ టైగర్‌. ఈ నేపథ్యంలో ఆయన యాంకరింగ్‌పై పలువురు ప్రశంసలు కురిపించగా యంగ్‌ హీరో రానా, “వెల్‌కమ్‌ టు ది వరల్డ్‌ ఆఫ్‌ హోస్టింగ్‌” అంటూ కామెంట్‌ పెట్టాడు. ఇక దీనిపై స్పందించిన ఎన్టీఆర్‌, థ్యాంక్యు చెబుతూ ‘నీక్కూడా గుడ్‌ లక్‌’ అంటూ కామెంట్‌ పెట్టారు.

 

అయితే మరోవైపు రానా కూడా వ్యాఖ్యతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘నంబర్‌.1 యారీ’ అంటూ రానా చేస్తున్న షోలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందులో వారి మనోభావాలను వెలికితీయడంలో కూడా రానా సక్సెస్‌ అయ్యాడు. ఏదేమైనా మొత్తానికి అటు బుల్లితెర, ఇటు వెండితెరపై టాప్‌ హీరోలు చేస్తున్న రచ్చతో వారి అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.

 

Comments

Share.

Comments are closed.