వెండితెరకే కాదు బుల్లితెరకు కూడా ‘బాస్’

0

ఒకే ఒక్క ఎంట్రీ.. ఒకేఒక్క ఇంట్రడక్షన్ తెలుగు బుల్లితెర మీద ఓ సంచలనంగా మారింది. అప్పటి దాకా తెలుగు వెండి తెర మీద తన స్టామినాను చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా తన నటనతో అదరగొడుతున్నారు. హిందీలో వస్తున్న బిగ్ బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు అనగానే ఓ సంచలనంగా మారింది. ఎన్టీఆర్ విషయంలో అందరికీ ఆసక్తి ఏర్పడింది.

 

అయితే వెండితెర మీద ఎవరు బాస్ అయినా కూడా తెలుగు బుల్లితెర మీద మాత్రం కేవలం ఒకే ఒక్క షోతో ‘బాస్’ గా మారుతున్నారు యంగ్ టైగర్. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారందరి కన్నా ఎన్టీఆర్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది.

 

అక్కినేని నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడుతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. మాటీవీలో నడిచే టాప్ వన్ ప్రోగ్రాం అదే అంటే ఆయన షో ఎంత పెద్ద హిట్టో అర్థమవుతుంది. ఆ తర్వాత సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి చేసారు. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ అంటూ ఇచ్చిన ఎంట్రీ అప్పటిదాకా ఉన్న షోల కన్నా చాలా రెట్లు హిట్ అయింది. నటనలో, డ్యాన్స్ తో మనల్ని మంత్రముగ్దుల్ని చేసే ఎన్టీఆర్… త్వరలోనే బిగ్ బాస్‌గా మాత్రమే కాకుండా బుల్లితెర బాస్‌గా మారడం మాత్రం ఖాయం అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

 

ఏది ఏమైనా కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ తో బుల్లితెర చరిత్రను తిరగరాస్తున్నారు. మరి 70 ఎపిసోడ్లతో ఎన్టీఆర్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారో చూడాలి మరి. All the Best NTR

 

SEASON-1 EPISODE-1 >> CLICK HERE TO WATCH

 

 

Comments

Share.

Comments are closed.